తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో…. చంద్రన్న ఆశయ సాదన పేరుతో పేరేచర్ల – కొండమోడు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోడెల శివరాం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సత్తెనపల్లిలోని టీడీపీ ఆఫీసు నుంచి పాదయాత్రకు బయలుదేరాలని భావిస్తున్న తరుణంలో పోలీసులు శివరామ్ ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. శివరామ్ తో పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు తీరుకు నిరసనగా టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.