ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏ చిన్న చాన్సు దొరికినా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ సైతం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో విజయవాడలో దళిత గర్జన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి సహ పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి.
విజయవాడలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్ కి వచ్చే పలు రహదారుల్లో ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే.. జైల్లో పెడతారు.. లేదా హౌజ్ అరెస్ట్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని.. అంతేకాదు ప్రతినిత్యం దళితులపై దాడులు సర్వ సాధారణం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా అభివృద్ది ఎక్కడ కనిపించడంలేదని.. ఎక్కడ చూసినా అన్యాయాలు.. అక్రమాలే అని విమర్శించారు. దళితులు మేల్కొనాలని.. ప్రభుత్వ అన్యాయాలపై సమర శంఖం పూరించాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.