ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా ఉంటాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటూ ఆరోపిస్తూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అవమానపడిన చోట ఉండనంటూ వైసీపీపై తిరుబాటు జెండ ఎగరవేశారు. అలానే భవిష్యత్తులో టీడీపీ పార్టీలో చేరుతాను అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక చంద్రబాబు అవకాశం ఇస్తే 2024లో నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తాని తెలిపారు. ఇలాంటి తరుణంలో కోటంరెడ్డి విషయంలో టీడీపీ నుంచి గట్టి ఎదురు దెబ్బతగిలినట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా నాయకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి నేటి వరకు ఎందరో నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అలానే ఈ జిల్లా నాయకుల వ్యవహార శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో జరిగిన ఎన్నో ఘటనలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో రాజకీయ రగడకు కొదవే లేదు. ఎన్నో సంచలన రాజకీయలకు ఈ జిల్లా వేదిక అయింది. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్, ఆనం రామనారాయణ రెడ్డిల వ్యవహారంతో నెల్లూరు జిల్లా రాజకీయం రాష్ట్రమంతటిని తనవైపు తిప్పుకునేలా చేసింది.
కొన్ని రోజుల క్రితం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్.. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ సొంతపార్టీపై తిరుగుబాటు చేశారు. అదే సమయంలో 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఇలా చంద్రబాబు.. టికెట్ ఇస్తాడనే ఆశతో కోటంరెడ్డి ధీమాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకు టీడీపీ షాక్ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తనకు తాను టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించిన కోటం రెడ్డిని టీడీపీలోకి రానివ్వద్దంటూ నియోజకవర్గ కార్యకర్తలు చంద్రబాబుతో అన్నట్లు సమాచారం.
నిన్నంటి వరకు అధికారం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయించాడని, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపినాడని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని చంద్రబాబుతో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై తెలుగు తమ్ముళ్లు చేసిన ఫిర్యాదు విషయంలో చంద్రబాబుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే కోటంరెడ్డి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండదనే ఆలోచన టీడీపీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. వారం రోజులగా కోటంరెడ్డి విషయాన్ని గమనిస్తున్న టీడీపీ పెద్దలు ఆయన నో ఎంట్రీ అని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కోటంరెడ్డి రాకను టీడీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ నియోజవర్గ నాయకులను కాదని కోటంరెడ్డికి టికెట్ ఇస్తే.. ఆయనతో కలిసి పనిచేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా లేరని, ఇప్పటికే కాస్తాకూస్తో ఉన్న పార్టీ కేడర్ కూడా పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని కొందరు చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశలకు చంద్రబాబు సైతం బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. అయితే కోటంరెడ్డికి టీడీపీ షాక్ ఇచ్చిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.