గుండెపోటు కారణంగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి క్షేమం కోరుతూ అభిమానులు, సామాన్యులు అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ.. అన్న కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం కోసం బాలకృష్ణ మరో నిర్ణయం తీసుకున్నాడు. తారకరత్న క్షేమం కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించాలని నిర్ణయించుకున్నాడట బాలయ్య. ఆ వివారాలు..
గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యం కోసం అన్ని తానై నిలబడ్డ బాలయ్య.. మరో నిర్ణయం తీసుకున్నాడు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. చిత్తూరు జిల్లాలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించాలని తన పీఏ రవికి సూచించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మృత్యుంజయ స్వామి ఆలయం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండటం బత్తలాపురంలో ఉంది. బాలకృష్ణ సూచన మేరకు తారకరత్న ఆరోగ్యం కోసం ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాక.. అఖండ జ్యోతి కూడా వెలిగించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇక బుధవారం వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి.. బెంగళూరు ఆస్పత్రికి వచ్చి తారకరత్నను పరమార్శించారు. డాక్టర్లను అడిగి తన అల్లుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాక తారకరత్నకు అండగా ఉన్న బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. విజయసాయిరెడ్డి సతీమణి చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి తారకరత్న కోసం బాలయ్య చేస్తున్న ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.