ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. వైద్యం, విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటం కోసం వారికి ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఓ సంక్షేమ పథకం లబ్దిదారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ సహకారం మరువలేనిది: నిర్మాత KS రామారావు
గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వచ్చిన స్టాలిన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రెడ్డప్ప, శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకున్నారు. లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తున్న సీఎం జగన్ అభినందనీయులని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కొత్త వివాదం: బాలకృష్ణ మాటను పట్టించుకోని సీఎం జగన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.