ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పెను సంచలనాలు సృష్టించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పై వాదోపవాదాలు సాగుతూ వస్తున్నాయి. కాగా, కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతూ వస్తుంది. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు సదీర్ఘంగా సాగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేసు విచారణ వేగవంతం చేయాలని.. ఆదేశించింది. హత్య కేసులో కుట్ర కోణాన్ని వెంటనే ఛేదించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో పేర్కొన్నటువంటి కుట్ర కోణాన్ని బయట పెట్టాలని తెలిపింది.
ఈ కేసు దర్యాప్తునకు వేగవంతం చేసే క్రమంలో కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీబీఐ సుప్రీం ధర్మాసనం ముందు ప్రతిపాదన ఉంచింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ను సీబీఐ తప్పించింది. అంతేకాదు ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణలో కొత్త సిట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్పీ వికాస్, ఎస్పీ ముఖేష్ కుమారులు ముఖ్య సభ్యులుగా వ్యవహరిస్తారు. సీబీఐ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30 వరకు ఈ కేసు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.
🔴BREAKING – మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.#VivekanandaReddy #SupremeCourt #AndhraPradesh #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 29, 2023