తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఆస్తులపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అప్పట్లో చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణ జరపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వెళ్లారు. అక్కడ చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. క్రింది కోర్టు అన్ని విధాలుగా ఆలోచించే ఈ పిటీషన్ ను కొట్టి వేసిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలి? అంటూ ఆమె తరపు న్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతీ లేవనెత్తిన అంశాలకు విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కోట్టేసింది. మరి.. చంద్రబాబు నాయుడి ఆస్తుల విషయంలో సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.