జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమాని ఒకరు జనసేన ప్రచారం కోసం వారిహి పేరుతో సైకిళ్లను తీసుకొచ్చాడు. వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో వారాహి సైకిళ్లు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడంటే
జనసేనాని పవన్ కళ్యాణ్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో ప్రత్యేక వాహనం కూడా సిద్ధం చేయించారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది ప్రారంభంలో కొండగట్టు, విజయవాడ ఆలయాల్లో వారాహికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కొన్ని రోజుల పాటు వారాహి.. ఏపీలో హల్చల్ చేసింది. ఇక ఎన్నికల వేళ వారాహి రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం ఏపీలో వారాహి హవా కొనసాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు వారాహి రంగుతో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరులో వారాహి సైకిళ్లు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి.
సుధాకర్ మాధవ్ పేరు గుర్తుందా.. జనసేన పార్టీ వాళ్లు ఇయన పేరు వినగానే వెంటనే గుర్తు పడతారు. గతంలో జనసేన పార్టీ ప్రచార కోసం జనసేన సింబల్, పవన్ కళ్యాణ్ స్టిక్కర్లను అతికించిన సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు సుధాకర్ మాధవ్. ఇక తాజాగా వారాహి సైకిల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వారాహి రంగుతోనే సైకిళ్లను దిగుమతి చేసుకున్న ఆయన వాటిపై జనసేన పార్టీ సింబల్ గాజుగ్లాసు, పవన్ కళ్యాణ్ స్టిక్కర్లను అతికించి మార్కెట్లోకి విడుదల చేయగా వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సైకిళ్ల కోసం జనసైనికులు ఎగబడుతున్నారు. ఈ సైకిళ్ల కోసం నిత్యం వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తుండటం విశేషం.
పవన్‌కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతున్న సుధాకర్ మాధవ్.. జనసేన పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ‘వారాహి’ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేశానని తెలిపాడు. ప్రస్తుతం వారాహి సైకిళ్లకు నెల్లూరులో విపరీతమైన డిమాండ్ ఉందని.. రోజూ వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగినట్లుగా సైకిళ్లను సరఫరా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని.. ఈ విషయంలో చాలా ఒత్తిడికి గురవుతున్నామని మాధవ్ చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీకి తనవంతు ఏదైనా చేయాలన్న సంకల్పంతోనే ‘వారాహి’ సైకిళ్లను ప్లాన్ చేశామని.. పార్టీలో ఎలాంటి పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశాడు. మరి ఈ వారాహి సైకిల్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.