హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి ఘటన మరువకముందే తాజాగా ఏపీలో ఓ చిన్నారిపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఏపీలో ఓ చిన్నారిపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. వెంటనే స్పందించిన ఆ చిన్నారి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో వీధికుక్క బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం ఓ వీధి కుక్క రోడ్లపై అటూ ఇటూ తిరుగుతూ ప్రజలపై దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే ఓ పారిశుద్ధ కార్మికురాలిని తీవ్రంగా గాయపరిచింది. అంతే కాకుండా రోడ్డుపై ఉన్న ఓ చిన్నారిపై కూడా ఆ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఈ బాలిక చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు.. విధి కుక్కల సంచారం గ్రామంలో ఎక్కువైందని, ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయంతో వణికిపోతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.