భూమిపై ఎన్నో రకాల జంతువులు, పక్షులు మనుగడ కొనసాగిస్తున్నాయి. వాటిలో మనకు కొన్ని జంతువులు, పక్షలు గురించి మాత్రమే తెలుసు.. ఎందుకంటే వాటినే మనం నిత్యం చూస్తుంటాం. అప్పుడప్పుడు కొన్ని వింతైన పక్షులు ప్రత్యక్షం అవుతుంటాయి.
ఈ భూమిపై ఎన్నో రకాల జీవరాసులు మనుగడ కొనసాగిస్తున్నాయి. ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి.. వాటిలో మనకు కొన్ని పక్షుల గురించి మాత్రమే తెలుసు.. అవే కనిపిస్తుంటాయి. Strange Bird భూమిపై మనకు కనిపించని పక్షులు అప్పుడప్పుడు దర్శనమివ్వడం చూస్తున్నాం. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇలాంటి వింతైన.. అరుదైన పక్షులను చూసే అవకాశం కలుగుతుంది. పక్షులు వలస జీవులు.. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. విచిత్రం ఏంటంటే.. అవి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా.. గుర్తుంచుకొని మరీ వాటి స్థావరాలకు తిరిగి వెళ్తుంటాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ అరుదైన పక్ష ప్రత్యక్షం అయ్యింది.. ఈ పక్షి పెద్ద కన్నులు, రెక్కలతో గుడ్లగూబ ను పోలినట్టు ఉంది.
సాధారణంగా ఎవరినైనా పక్షుల పేర్లు చెప్పమంటే.. కాకి, పావురం, చిలుక, కోడి, బాతు, గద్ద.. ఇలా కొన్ని పక్షుల పేర్లు మాత్రమే తెలుసు అని చెబుతుంటారు. ఎందుకంటే మనకు నిత్యం కనిపించేవి ఆ పక్షులు మాత్రమే. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో నివసించేవారికి ఎన్నో రకాల పక్షులు దర్శనమిచ్చేవి.. వాటి పేర్లు కూడా టక్కున చెప్పేవారు. భూమిపై మానవ మనుగడ కోసం వేల ఎకరాల్లో అడవులను నరికి వేస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు జంతు, పక్షి జాతులు అంతరించి పోతున్నాయి.
అప్పుడప్పుడు కొన్ని వింతైన పక్షులు మన కంటికి కనిపించనపుడు ఏదో వింత పక్షి వచ్చిందని ఆశ్చర్యపోతుంటాం. సోషల్ మీడియా పుణ్యమా అని వాటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ప్రకాశం జిల్లాలో ఓ వింత పక్షి ప్రత్యక్షం అయ్యింది. ఆ పక్షి ఆకారం చూడటానికి చాలా విచిత్రంగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిని పాల పక్షి అని పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో కూడా విచిత్రమైన పక్షులు తెలుగు రాష్ట్రల్లో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే.