శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ భక్తుల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో భక్తులు కాస్త షాక్ కు గురవుతున్నారు. విషయం ఏంటంటే..? శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే కొందరు సంప్రదాయ దుస్తువులు ధరించకుండా ఇష్టమొచ్చిన దుస్తువులు ధరించుకుని గర్భగుడిలోకి ప్రవేశిస్తుంటారు.
అయితే ఇలా వచ్చే భక్తుల విషయంలో తాజాగా ఆలయ కమిటీ భక్తులు సంప్రదాయ దుస్తువులు ధరించి వస్తేనే గర్భగుడిలో అనుమతి ఇస్తామంటూ స్పష్టం చేసింది. అలా కాకుండా ఇష్టమొచ్చిన దుస్తువులు ధరించి వస్తే అనుమతించమంటూ తెలిపింది. ఇక భక్తుల అభ్యర్ధన మేరకు రోజుకు రెండుసార్లు ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 2 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపింది ఆలయ కమిటీ.