హిందులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ పండుగ సందర్భంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించడమే కాదు శ్రీరామ కళ్యాణం కూడా నేడు జరగడం విశేషం.
దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా ఆలయాలన్నీ కిట కిటలాడిపోతున్నాయి. దేవాలయాన్నీ జై శ్రీరామ్ అంటూ మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వా గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో వేడుకల కోసం ఏర్పాటు చేసిన మండపానికి ఒక్కసారే నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పందిళ్లు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అందరూ భావిస్తున్నా . అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ప్రాంగణం వద్ద ఉన్న భక్తులు మంటలు చూసి అక్కడ నుంచి పరుగులు పెట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయలు జరగలేదు.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం అంతా శ్రీరాముడి దయ అంటూ భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
బ్రేకింగ్: ప.గో. జిల్లా తనుకు మండలం దువ్వా గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల అపశృతి చోటు చేసుకుంది. వేడుక కోసం ఏర్పాటు చేసిన పందిళ్లకు మంటలు అంటుకున్నాయి.#WestGodavari #Tanuku #SumanTV pic.twitter.com/gvFRkLE2YL
— SumanTV (@SumanTvOfficial) March 30, 2023