సంక్రాంతి అంటే జనాలకే కాదు.. ఆర్టీసీ వారికి, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి, రైల్వే వారికి అందరికీ పండగే. ఎందుకంటే పండక్కే కదా జనాలు బస్సుల్లో, రైళ్లలో కిక్కిరిసిపోయి మరీ ఊళ్ళకి వెళ్తుంటారు. డిమాండ్ కి తగ్గట్టు బస్సులు, రైళ్లు ఎన్ని పెంచినా జనానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కూర్చోడానికి సీట్లు దేవుడెరుగు, నిలుచోడానికి ఒక అడుగు ఉన్నా చాలని తెలంగాణ నుంచి ఆంధ్రా వెళ్లే డెడికేటెడ్ ప్రయాణికులు ఉన్నారు ఈ సమాజం ఆఫ్ తెలుగు స్టేట్స్ లో. ఈ డెడికేషన్ ని చూసి తట్టుకోలేని రైల్వే శాఖ.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోతున్నాం గురూ అని చెప్పి 30 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళు బాగా ఎక్కువగా ఉండడంతో.. అదనంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మామూలు సీజన్ లోనే రైలు టికెట్లు దొరకవు. అలాంటిది సంక్రాంతి సీజన్ అంటే సమస్యే లేదు. స్టేషన్ లో అన్ని రైళ్లు పెట్టుకుని ఏపీకి కొన్ని రైళ్లు ఏర్పాటు చేయలేరా అని అనుకునే ప్రయాణికుల మనోవేదనను విన్నదో ఏమో.. రైల్వేశాఖ సంక్రాంతి సోగ్గాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జనవరి 1 నుంచి 20 వరకూ 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ.. ఇవే తేదీల్లో అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల నుంచి మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ సిటీలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ఈ రైళ్లలో జనరల్ బోగీలు, రిజర్వ్డ్ బోగీలు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 124 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. జనరల్ ప్రయాణికులు ఇక డిసెంబర్ 31 ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. యూటీఎస్ మొబైల్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చునని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏ స్టేషన్ల నుంచి ఏ స్టేషన్లకి ఏ ఏ తేదీల్లో ప్రయాణించనున్నాయో, రైలు నంబర్లు ఏమిటో ఆ వివరాలు మీ కోసం.
సంక్రాంతికి ఎక్కువ రద్దీ ఉండడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాబట్టి ముందుగానే యూటీఎస్ రైల్వే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే హ్యాపీగా పడుకుని ప్రయాణం చేయవచ్చు. కిక్కిరిసిపోవడం, కూర్చోడానికి చోటు లేక డోర్ దగ్గర నిలబడడం, ఇబ్బంది పడడం కాళ్ళు నొప్పులు, లేనిపోని తలనొప్పులు లేకుండా ఎంచక్కా ముందుగానే బుక్ చేసుకుని దర్జాగా ఈ సంక్రాంతికి ఊరుకెళ్ళచ్చు. మరి సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దమరైపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.