పండగ కోసం పట్టణం వదిలి పల్లెల బాటపట్టే వారికి దక్షిణ మధ్య రైల్వేస్ మంచి కబురు చెప్పింది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేస్ సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07456సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31 తేదీల్లో)
07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30 తేదీల్లో)
07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28 తేదీల్లో)
07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30 తేదీల్లో)
Extension of Special Trains services to clear #Sankranti Festive rush pic.twitter.com/eqaMN1snkO
— South Central Railway (@SCRailwayIndia) December 24, 2021