అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా ఇదీ.. అమ్మతనానికి ఉన్న అస్సలు అర్థం. ఈ సృష్టిలో తల్లిని మించిన యోదులు ఎవరూ లేరన్నది అక్షర సత్యం. ఇక కొందరు అమ్మలేని లోటును తీర్చలేనిదని భావించి ప్రేమతో అమ్మపేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకోవడం, బొమ్మలు వేసుకోవడం అనేది మనం చాలానే చూశాం. కానీ నవమాసాలు మోసి పెంచిన తల్లిని చివరికి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఓ కొడుకు తల్లిని మరిచిపోలేక ఏకంగా రూ.10 కోట్ల ఖర్చుతో ఏకంగా గుడినే కట్టాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
ఇది కూడా చదవండి: Jagtial Crime: MRO, SI, MPOపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించిన రైతు
అస్సలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? తల్లిపై అంత ప్రేమున్న కొడుకు ఎవరని తెలుసుకోవాలనుందా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. అది శ్రీకాకుళం జిల్లా చీమలవలస గ్రామం. ఇదే ప్రాంతంలో ఉండే శ్రావణ్ అనే వ్యక్తి తల్లి 2018లో అనారోగ్య సమస్యల కారణంతో మరణించింది. దీంతో అప్పటి నుంచి కొడుకు శ్రావణ్ తల్లిని తలుచుకుంటూ కుమిలిపోయేవాడు. ఇక అమ్మ పేరు మీద జీవితాంతం గుర్తిండేలా ఏదైన చేయాలనుకున్నాడు.అందులో భాగంగానే దాదాపుగా రూ.10 కోట్ల ఖర్చుతో ఏకంగా అతి పెద్ద గుడిని కట్టిస్తున్నాడు. ఇక కొడుకు శ్రావణ్ మాట్లాడుతూ.. నేను కట్టించే ఈ గుడి మా అమ్మకే కాకుండా ప్రపంచంలోని ప్రతీ అమ్మకి అంకితం అయ్యే విధంగా గుడిని నిర్మిస్తున్నట్లు తెలిపాడు. ఈ గుడిని చూస్తే ప్రతీ అమ్మ మనసుని తెరిచి చూసేలా అనేపించే విధంగా ఈ గుడిని నిర్మాణం చేపట్టినట్లు శ్రావణ్ తెలిపాడు. తల్లి కోసం ఏకంగా రూ.10 కోట్లతో గుడి కట్టిస్తున్న ఈ కొడుకు ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.