మన దేశంలో జీవులను దేవుళ్లగా పూజిస్తుంటాం. ఆవు, పాము వంటి జీవాలకు నిత్యం పూజలు చేస్తుంటారు. ఎదైనా కారణాలతో అవి మరణిస్తే మనుషులకు చేసినట్లే అంత్యక్రియాలు చేస్తుంటారు. అలాంటివి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాము. అయితే చనిపోయిన ఓ పాముకు అంత్యక్రియాలు చేసిన ఘటన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జంట పాములు సంచరిస్తూ ఉన్నాయి.
ఇటీవలికాలంలో అవి ఆలయ ప్రాంగణంలో కూడా కనిపించేవి. ఆ రెండు పాములు ఆలయ ప్రాంతంలో సంచరిస్తుండంతో అక్కడి వచ్చే భక్తులు వాటికి పూజలు చేస్తున్నారు.ఇక అర్చకులు, కమిటీ సభ్యులు కూడా వీటిని దైవంగా భావిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా ఆలయ పరిసరాల్లో ఆ జంట పాములు కనిపించలేదు. అయితే ఏమైందో.. ఏమో.. తెలియదు కానీ, వాటిల్లో ఒక పాము మృతిచెందిన స్థితిలో కనిపించింది. శుక్రవారం సాయంత్రం దుర్గా ఘాట్ దగ్గర ఉన్న ఓ టర్నింగ్ పాయింట్ వద్ద ఈ పాము చనిపోయి కనిపించింది. దైవంగా భావించే పాము చనిపోవడంతో అర్చకులు, కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు దానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.