YS Jagan Mohan Reddy: చంటి పిల్లల్ని చూస్తే ఎవరికి మాత్రం ముద్దు అనిపించదు చెప్పండి. వాళ్ల అమాయకమైన ఫేసుల్ని చూడగానే చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. ఓ చంటి పిల్లాడిని చూడగానే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా అలానే అనిపించింది. వెంటనే పిల్లాడిని చంకలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు సీఎం జగన్ జేబులోంచి పెన్నును లాగేశాడు. వివరాల్లోకి వెళితే.. సీఎం వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా, పెదపూడి లంకలోని వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఓ చంటి పిల్లాడిని ఆయన తన చంకలోకి తీసుకున్నారు. పిల్లాడిని చంకలో ఉంచుకునే బాధితులతో మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ బుడ్డోడు సీఎం జగన్ జేబిలోని పెన్నును ఠక్కున బయటకులాగాడు. అదికాస్తా జేబులోంచి కిందపడిపోయింది. ముఖ్యమంత్రి జేబిలో పెన్ను కిందపడేసరికి అక్కడి జనం నానా హంగామా చేశారు.
సీఎం జగన్ మాత్రం పెన్నును ఆ బాబుకే బహుమతిగా ఇచ్చేశారు. ముఖ్యమంత్రి అలా పెన్ను ఇవ్వగానే ఆ బాలుడు దాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. సీఎం తమ కుమారుడికి పెన్ను కానుకగా ఇవ్వటంతో బాలుడి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. కాగా, సీఎం జగన్ వాడుతున్న ఆ పెన్ను మౌంట్ బ్లాక్ బాల్‌పెన్. దాని ఖరీదు 40 వేలు ఉండొచ్చని అంచానా. మరి, సీఎం జగన్ జేబులోంచి పెన్ను లాగేసిన బుడ్డోడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : APలో అవినీతి నిర్మూలనకు ‘కాల్ 14400’ సర్వీస్! విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం జగన్!