కొండల మధ్యలో నదిపై బోటు ప్రయాణం చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సంతోషం కోసం చేసే పడవ ప్రయాణాల్లో అప్పుడప్పుడు విషాదాలు జరుగుతుంటాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘోర విషాదం చోటుచేసుకుంది.
నదుల్లో, సముద్రాల్లో ప్రయాణం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలా నదిల్లో పడవ ప్రయాణంలో చుట్టూ ఉండే కొండలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలానే ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పడవలో ప్రయాణం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఈ పడవ ప్రయాణాలు విషాదాన్ని నింపుతుంటాయి. పడవ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు జల సమాధి అయిపోతున్నారు. ఇప్పటికే బోటు ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. తోడేరు చెరువులో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు బయటపడగా.. ఆరుగురు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరులో విషాయం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం పది మంది యువకులు తోడేరు చెరువులో బోటుపై షికారుకు వెళ్లారు. ఈక్రమంలో ఆ యువకులు వెళ్తున్న పడవ తిరగ పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ నీళ్లలో పడ్డారు. ఈ ఘటనలో నలుగురు క్షేమంగా బయటపడ్డగా.. ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన వారు సురేంద్ర(19), రఘు(24),బాలజీ(21), త్రినాథ్(18), కళ్యాణ్(28), ప్రశాంత్(29) గా పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పొదలకూరు పోలీసులు గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇక తోడేరు చెరువులో జరిగిన బోటు ప్రమాదం పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియగానే కేరళలో జరుగుతున్న వ్యవసాయ సదస్సు నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి కాకాణి ఆదేశించారు. మరి.. ఇలాంటి పడవ ప్రమాదాల నివారణకు మీ సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.