యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రవికృష్ణ. ‘మొగలిరేకులు’ అనే సీరియల్ తర్వాత ‘వరూధినీ పరిణయం’ అనే ధారావాహికతో క్రేజ్‌ను అందకున్నాడు. వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది నవ్య స్వామి. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి పరిచయం అయిందీ సౌతిండియన్ హీరోయిన్. నటించిన కారణంగానో మరే రీజనో తెలియదు కానీ రవి కృష్ణ – నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారని టాక్ నడిచింది. బుల్లితెరపై వీరి కెమిస్ట్రీ పండడానికి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణం అని కొందరు వాదిస్తున్నారు. అవి వట్టి పుకార్లే , తమ మధ్య ఏం లేదని నవ్య స్వామి ఖండించింది.
నవ్య – రవి కృష్ణ కలిసి ఈవెంట్లు, షోలు చేయడం, నవ్య షేర్ చేసిన ఫొటోలకు రవి కృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం చూస్తుంటే ఆ వార్తలకు మరింత బలం చూకూరుతుంది. లేటెస్ట్ గా ఆమె ఫొటోపై రవి కృష్ణ ఇలాగే స్పందించడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి సోషల్ మీడియాలో చర్చికుంటున్నారు. తన ఇంట్లో తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని ప్రస్తుతం తాను కెరీర్ మీద ఫోకస్ పెట్టానని అన్నీ కుదిరితే వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చని నవ్య స్వామి స్పష్టిచేసింది. రూమర్లను తిప్పికొట్టింది.
‘గతంలో నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పటికి ఈ కామెంట్ పై రవికృష్ణ కానీ, నవ్య స్వామి కానీ స్పందించలేదు.