Squirrel: రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో రోడ్డుపై వెళుతున్న ఆటోపై హైటెన్షన్ వైర్ తెగిపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8మంది సజీవ దహనం అయ్యారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఉడతేనంటూ విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విద్యుత్ శాఖ అధికారుల ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం దీనిపై ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టే పనిలో పడింది.
ఇందులో భాగంగా తప్పు ఉడతదే అని తేల్చేందుకు అధికారులు ఉడతకు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, శవ పరీక్షల ఫలితాలు ఏంటన్నది బయటకు వెల్లడించలేదు. ఇక, ఉడతకు శవ పరీక్ష నర్విహించటంపై కూడా సోషల్ మీడియా అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం ఎందువల్ల జరిగిందో తెలుసుకోవాలంటే కరెంట్ వైర్లకు నాణ్యతా పరీక్షలు చేయాలి కానీ, ఉడతకు పోస్టుమార్టం చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు ఉడతదే తప్పని తేల్చే పనిలో పడటం తమాషాగా ఉందని అంటున్నారు. ఓ ప్రమాదానికి చిన్న జంతువును కారణంగా చూపిస్తూ దానికి పోస్టుమార్టం నిర్వహించటం చరిత్రలో ఇదే మొదటి సారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి, సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదానికి ఉడతే కారణం అంటున్న ప్రభుత్వ అధికారుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవ దహనం