ఏపీలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు వైసీపీ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు వైసీపీ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇందుకోసం కసరత్తు చేసిన ఆ పార్టీ నాయకత్వం.. సోమవారం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ 1, ఓసీలకు 4 స్థానాలు కేటాయించారు. మొత్తం ఖాళీల్లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక సంస్థల కోటాలో 9 మంది, గవర్నర్ కోటాలో రెండు ఖాళీలు ఉన్నాయి. మరి.. అభ్యర్ధుల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్థానిక సంస్థల కోటా కింద నర్తు రామారావు(శ్రీకాకుళం), కుడుపూడి సూర్యనారాయణ(తూర్పు గోదావరి), వంకా రవీంద్రనాథ్ (పశ్చిమ గోదావరి), మేరుగ మురళి (నెల్లూరు), డా. సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు), రామసుబ్బారెడ్డి (కడప), డాక్టర్ మధుసూదన్ (కర్నూలు), ఎస్. మంగమ్మ (అనంతపురం)లను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. పెనుమత్స సూర్య నారాయణ (విజయనగరం), పోతుల సునీత (ప్రకాశం), కోలా గురువులు (విశాఖపట్నం), బొమ్మి ఇజ్రాయిల్ (తూర్పుగోదావరి), జయమంగళ వెంకట రమణ (పశ్చిమ గోదావరి), ఏసు రత్నం (గుంటూరు), మర్రి రాజశేఖర్ (గుంటూరు) లను ఎమ్మెల్యే కోట కిందా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. కుంభా రవి(అల్లూరి జిల్లా), కర్రి పద్మశ్రీ (కాకినాడ) వీరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మరి.. వైసీపీ అధినాయకత్వం ప్రకటించిన 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.