Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ”గడప గడపకు” కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీచును ఎల్లో మీడియా వక్రీకరించటంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు గోతికాడ నక్కలలాగా కాచుకు కూర్చుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఓపెన్‌గా ఇంట్లోకి వచ్చి.. మీ కుటుంబానికి ఇది చేశామని చెప్పుకోగలిగే పార్టీ ఇంతవరకు ఏదీ లేదు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా లేదు. ముఖ్యమంత్రి నుంచి అందరూ డెడికేషన్‌తో పని చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాము. అదే మా పార్టీ విజయానికి కారణం.
గడప గడపకు రివ్యూ మీటింగ్‌లో ముఖ్యమంత్రి అన్న మాటల్ని ప్రత్యర్థులు వక్రీకరించారు. గోతికాడ నక్కల లాగా కాచుకు కూర్చున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వేరే రకంగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారు. వాళ్లు ప్రచారం చేస్తున్నట్లు ఏమీ జరగటం లేదు. అందరూ కలిసి పని చేయాలని మాత్రమే ముఖ్యమంత్రి చెప్పారు. అందరూ పాజిటివ్‌గా ఉన్నారు. ప్రభుత్వం కూడా పాజిటివిటీతో పని చేస్తోంది. ఫలితాలు కూడా పాజిటివ్‌గా ఉంటున్నాయి. మా వాళ్లు హ్యాపీగా ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు. మొన్నటి మీటింగ్ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది” అని అన్నారు.
— Hardin (@hardintessa143) September 30, 2022