గత కొద్ది రోజులుగా సాయి ప్రియ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. సముంద్రంలో గల్లంతు అయ్యిందని భావించిన ఆమె ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తితో కనిపించింది. ఆమె కోసం ప్రభుత్వం గాలింపు చర్యల కోసం దాదాపు రూ.కోటి కూడా ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని తాజాగా ప్రియుడితో తాళి కూడా కట్టించుకుంది. తనని క్షమించాలంటూ తండ్రికి వాయిస్ మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా సాయిప్రియ, ఆమె ప్రియుడ్ని పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ లో సాయి ప్రియ మీడియాతో మాట్లాడింది. శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని అప్పుడే చెప్పినట్లు తెలియజేసింది. కానీ, తల్లిదండ్రులు వినిపించుకోకుండా వివాహం చేశారంది. రవిని చిన్నప్పటి నుంచే ఇష్టపడినట్లు తెలియజేసింది.
అంతేకాకుండా రవితో కలిసి జీవించాలని అనుకుంటుందని.. సమాజం తనని క్షమించాలని వేడుకుంది. అలా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సాయి ప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. నీళ్లు కొట్టిన తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. రవి ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. అయితే వీరి పెళ్లిని తల్లిందండ్రులు ఆమోదించారా? లేదా అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.