ఇటీవల పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టెక్నికల్ ఇబ్బందుల వల్లలో లేదా పట్టాలు తప్పిపోవడం వల్లనో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రాణ నష్టం.. కోట్లలో ఆర్థిక నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో ఉదయం అనూహ్య సంఘటన ఒకటి జరిగింది. ఉదయం గుంటూరుకు వచ్చే శబరి ఎక్స్ ప్రెస్ కంకరగుట్ట రైల్వే గేట్ వద్దకు వచ్చే సమయంలో ట్రాక్ పై ఒక ఇనుప రాడ్డు కట్టి ఉండటాన్ని పోలీసులు గమనించి వెంటనే దానిని తొలగించారు. దీంతో శబరి ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది.
గుంటూరు లోని కంకర గుంట గేట్ వద్ద ఎవరో గుర్తు తెలియని అగంతకులు ఒక ఇనుపరాడ్డును ట్రాక్ పై అడ్డంగా గుడ్డతో కట్టి ఉంచారు. ఒక వేళ పొరపాటున అటుగా వస్తున్న శబరి ఎక్స్ ప్రెస్ గనుక వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ సకాలంలో రైల్వే పోలీసులు ట్రాక్ పై రాడ్డు ఉండటాన్ని గమనించి వెంటనే దాన్ని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ దారుణానికి ఎవరు పాల్పడి ఉంటారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ సమీపంతో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా.. లేక సంఘ విద్రోహులు చేసిన పనా? అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక రైల్వే గెటు సమీపంలో ఉన్న ప్రత్యేక్ష సాక్షులను వివరాలు అడిగా సమాచారం సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనపై రైల్వే చట్టం సెక్షన్ 154,174సి కింద కేసు నమోదు చేసి ఎంక్వేయిరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.