ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాల జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా.. ఇతర సాంకేతిక లోపాలు తలెత్తడం, ప్రకృతి వైపరిత్యాల వల్ల ఈ ప్రమాదాలు సంబవిస్తున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లా అహోబిలం దగ్గర ఓ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు లోయలో పడి ప్రమాదానికి గురైంది.
ఆళ్లగడ్డ డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగవ అహోబిలం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడం.. వేగం నియంత్రించుకోలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. దాదాపు ఈ బస్సు 20 అడుగుల లోతులో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ప్రక్కనే వాగు ఉన్నప్పటికీ అందులో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
ఈ సంఘటన జరిగినపుడు బస్సులో డ్రైవర్, కండెక్టర్ తో పాటు ఐదుగురు ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. పల్టీలు కొట్టే సమయంలో సీట్లలో ఇరుక్కుపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి మాత్రం తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే 108 కి ఫోన్ చేయండంతో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.