Rowdy Monkey: కాకినాడ జిల్లాలో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పెద్ద పులి ఎప్పుడు మీద పడుతుందో అని జిల్లా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. అధికారులు కూడా పులిని పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా దొరకటం లేదు. ఓ వైపు కాకినాడ జిల్లాను పెద్దపులి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరో వైపు పక్కనే ఉన్న కోనసీమ జిల్లాలో రౌడీ కోతి కలకలం సృష్టిస్తోంది. విచ్చల విడిగా జనంపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మండపేట జోన్‌లోని గాంధీనగర్ గ్రామంలో ఓ రౌడీ కోతి సంచరిస్తోంది. పిచ్చి పట్టినట్లు జనంపై దాడులు చేస్తోంది. ఇప్పటికే బూరుగుంట పార్క్ ఏరియాలో పదుల సంఖ్యలో జనంపై దాడి చేసి గాయపర్చింది.
తాజాగా, శ్రీను అనే ఓ యువకుడిపై దాడి చేసి గాయపర్చింది. శ్రీను రెండు చేతుల్ని తీవ్రంగా కొరికిపడేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రౌడీ కోతి ఎప్పుడు ఎక్కడినుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక జనం భయపడిపోతున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇంట్లోనుంచి బయటకు రావాలంటే గజగజ ఒణికిపోతున్నారు.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ముసలి వాళ్లు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తమకు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతిని ఎలాగైనా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారుల్ని వేడుకుంటున్నారు. మరో దాడి జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి, గ్రామాన్ని వణికిస్తున్న రౌడీ కోతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Cordelia Cruise: మొదటిసారి విశాఖపట్నంలో క్రూయిజ్ షిప్..! ఇందులో ప్రయాణించడానికి ఖర్చు ఎంతంటే?