తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అక్కడ నుండి మెట్ల మార్గంగా గానీ లేదా రోడ్డు మార్గం ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. తిరుమల ఘాటు రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాస్త అప్రమత్తంగా ఉన్నా సరే అక్కడ ప్రమాదాలు సంభవించే అవకాశాలెక్కువ. తాజాగా..
తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అక్కడ నుండి మెట్ల మార్గంగా గానీ లేదా రోడ్డు మార్గం ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. అయితే కొన్ని సార్లు ఈ దైవ దర్శనాల్లో విషాదాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా తిరుమల ఘాటు రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాస్త అప్రమత్తంగా ఉన్నా సరే అక్కడ ప్రమాదాలు సంభవించే అవకాశాలెక్కువ. ఇప్పటికే పలు వాహనాలు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మలుపుల్లో ఎన్నో ప్రమాదాలు జరిగి.. ఆ శ్రీవారిని దర్శించుకునే క్రమంలో.. అనంత లోకాల్లోకి కలిసిపోయిన ప్రాణాలెన్నో. తాజాగా తిరుమలలో మరో ప్రమాదం జరిగింది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద తుపాను వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‍లోనే తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన పార్వతమ్మ అనే భక్తురాలు మృతి చెందింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మరో భక్తురాలు ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం క్షతగాత్రులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదటి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో టీటీడీ విజిలెన్స్, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.