కలియుగ దైవం తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వివధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. మంత్రి రోజా తరచుగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకునే సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల స్వామి వారికి దర్శనం కోసం వెళ్లిన మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురయ్యింది. 20 మంది అనుచరులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన రోజాకు టీటీడీ నో చెప్పింది. కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. రోజా అడిగినప్పటికి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ నిరాకరించింది. దీంతో రోజా తీవ్ర అసహనానికి గురయ్యారు. టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగతా వారికి కూడా దర్శనం అయ్యే వరకు అనగా రెండు గంటల పాటు శ్రీవారి ఆలయంలోనే ఎదురు చూశారు రోజా. అందరికి దర్శనం అయిన తర్వాత ఆమె బయటకు వచ్చారు. ఈ సందర్భంగా రోజా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ.. చెప్పుకుంటే బాధ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కానీ టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి అన్నారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తుల స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మరి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవితో మంత్రి రోజా సెల్ఫీ!
ఇది కూడా చదవండి: ఫ్రెండ్‌షిప్ డే రోజు విమానంలో రోజాకు ఊహించని గిఫ్ట్.. వైరలవుతోన్న పోస్ట్!