ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. మన ఊరు మన పోరు కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డికి వెళ్తుండగా తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ‘మన ఊరు .. మన-పోరు’ బహిరంగ సభను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యందుకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది.
తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం తర్వాత రేవంత్ రెడ్డి మరో వాహనంలో వెళ్లినట్టు సమాచారం. కాగా, నిన్న తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో 25 మందితో కూడిన బృందం 600 కిలోమీటర్ల మేర సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.