భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. అలానే మనిషి జీవితం కూడా అంతే. పుట్టేటప్పుడు కాలి చేతులతో వస్తాడు. ఎన్నో ఆస్తులు, ఐశ్వర్యలా కోసం పోరాడుతాడు. అన్ని సాధించిన. ఇలాంటి మానవ మజలీ చివరికి ముగిసేది మరణంతోనే. అయితే ప్రతి ఒక్కరు తమ మరణం తరువాత ఎలా ఉంటుందో చూడలి అనుకుంటారు. తమ శరీరం ఎక్కడ ఉంచుతారు?. ఎలా ఖననం చేస్తారు? అనేక కోరికలు ఉంటాయి. కానీ అది సాధ్యం కాదు. మరణించిన వ్యక్తికి వారి బంధువులు స్మారకంగా సమాధులు నిర్మిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చనిపోయిన వ్యక్తి అవి చూడలేడు. అయితే ఓ రిటైర్డ్ పోలీస్ మాత్రం అందరికి భిన్నంగా మరణానికి ముందే తన సమాధిని నిర్మించుకున్నాడు. అంతే కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన సమాధి వద్దనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ వింతైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాటూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు షేక్ మజీబ్ సాహెబ్(72). నిరు పేద కుటుంబంలో జన్మించిన సాహెబ్ చదువుపై మక్కువతో ఎన్నో కష్టాలుపడి 1973 డిగ్రీ పూర్తి చేశాడు. అదే ఏడాదిలో పోలీస్ శాఖలో కొలువుకు చేరాడు. ఎస్సైగా 2010లో సాహెబ్ రిటైర్డ్ అయ్యాడు. తనకున్న రెండు ఎకరాల భూమిలో మామిడి, అరటి తోటలను సాగు చేస్తున్నాడు. ఆ తోటకు ముందు వైపు సమాధుల నిర్మాణం చేపట్టాడు. అందులో ఒకటి ఆయన తల్లి బీబీజాన్ సమాధికాగా.. మరొకటి అతని అన్న ఎస్కే సత్తార్ సమాధి. అయితే వీటికంటే ముందు 20 ఏళ్ల క్రితమే తన కోసం సమాధి నిర్మించుకున్నాడు సాహెబ్.
పదవి విరమణ పొందిన తర్వాత ఎక్కువ సమయం సమాధి వద్దనే గడపడంతో తనకు ఎంతో ప్రశాంతను కలుగజేస్తుందని ముజీబా సాహెబ్ అంటున్నారు. అసలు ఇలా బ్రతికుండాగా సమాధి ఎందుకు నిర్మించారు అన్న ప్రశ్నకు అదిరిపోయే సమాధనం ఇచ్చాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అనేక ఘటనలు తనను కలిచి వేశాయని, వాటిని చూసేసరికి మరణం అనే భయం పోయింది. ఈ సృష్టిలో మనిషి పుట్టుకా అనేది ఎంత నిజమో మరణం అనేది అంతే నిజం. మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరని అంటున్నాడు.
మట్టిలో కలిసిపోయే మనిషి శరీరం గురించి వేదన చెందాల్సినవసరం లేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో బ్రతికుండగానే తన సమాధి తానే నిర్మించుకుని, చూసి మురిసిపోతున్నాడు. సమాధిపై అనేక సూక్తులు రాసి ఉంటాయి. వాటిని చూసి అందరూ తమ స్వార్థాన్ని వదిలి పది మందికి సహాయం పడుతారనే కోరికతో తాను ఉన్నట్లు ఆయన అంటున్నారు. మరి.. ఇలా తన మహాప్రస్థానం కోసం ముందే ఏర్పాట్లు చేసున్న ఈ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.