ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించింది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు విశాఖలో అనువైన స్థలాన్ని లీజు పద్ధతిన కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, కార్యాలయ నిర్మాణానికి ఏపీఐఐసీకి చెందిన స్థలం సిద్ధంగా ఉన్నప్పటికీ, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి నిర్మాణం పూర్తయిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని ఆర్బీఐ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో విశాఖపట్నం తొందరలోనే రాజధాని అయిపోవటం ఖాయమని రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి.
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ భావిస్తోందట. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బృందం విశాఖ జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోనే రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఉన్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ నిర్వహించే సమావేశాలకు రిజర్వు బ్యాంకు అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాల్సి ఉంటోంది. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టసాధ్యమవుతోందని.. రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంను రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
RBI regional office in Hyderabad currently handles the activities of the Telugu states.#RBI #hellovizag #vizag #visakhapatnam #hellovizag #vizag #hellovizagmagazine #visakhapatnam #hellovizag #vizagcity #vizagbloggers #vizagdiaries #vizagplaces pic.twitter.com/ACnfRNN6XH
— Hello vizag (@hello_vizag) February 6, 2023