ఏపీలో ప్రారంభమైన సినిమా టికెట్ల వివాదానికి ముగింపు రాబోతుంది. దీనిపై చర్చించేందుకు చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి చేరుకున్న ప్రముఖులు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ని కలిశారు. భేటీ ప్రారంభం అయ్యింది.. చర్చలు సాగుతున్నాయి. సినిమా టికెట్ల ధర సహా ఇతర అంశాలపై ప్రధానంగా ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితర ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు.
అయితే ఈ భేటీలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్‌ను కలిసే లిస్ట్‌లో వీరిద్దరి పేర్లు ఉన్నా చివరి నిమిషంలో ఎందుకు గైర్హాజరయ్యారు అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. జూనియర్ హాజరుకాకపోవడం వెనక కుటుంబ, వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున ఎందుకు హాజరు కాలేదని చర్చించుకుంటున్నారు జనాలు.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ తో భేటీకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
అయితే జూనియర్ మాదిరి నాగార్జున హాజరు కాకపోవడం వెనక పెద్ద కారణాలు ఏమి లేవని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా నాగార్జున భేటీకి హాజరుకాలేదని సమాచారం. అది ఏంటంటే నాగార్జున భార్య అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. అందువల్ల నాగార్జున ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని.. అందుకే భేటీకి హాజరు కాలేదని తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.