మిగతా కాలల్లో కంటే.. వేసవిలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే భానుడు భగభగమండిపోతుండటంతో.. జనాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో సేదదీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుండను తలపిస్తున్నాయి. ఇలాంటి వేడి పరిస్థితుల్లో కరెంట్ కోతలు ఉంటే జనాలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఏపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. వేళాపాళా లేని కరెంట్ కోతలతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో రోగులు నరకం చూస్తున్నారు. జనరేటర్ ఆన్ చేయాలంటే.. డీజిల్ కూడా లేకపోవడంతో.. ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో కరెంటు కోతల కలవరం.. ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసిన శిశువులు, బాలింతలు!
రాష్ట్రంలో కరెంట్ కోతలపై ప్రజలు, విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం భారీగా విద్యుత్ చార్జీలు పెంచడంతో.. బిల్లుకు భయపడి ప్రజలే కరెంట్ వాడాలంటే వెనకా ముందు ఆలోచిస్తున్నారు. కానీ వేసవి కావడంతో.. మధ్యాహ్నం, రాత్రి వేళ కరెంట్ వినియోగం తప్పనిసరి అవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వరుసగా రెండు, మూడు రోజుల నుంచి చాలా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 2-3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. వారు సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగింది అంటున్నారు.
సాంకేతిక సమస్య వల్లే పవర్ కట్..
ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం 800 మెగావాట్ల కొరత తలెత్తిందని, అందుకే ఐదు జిల్లాల పరిధిలో విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు తెలిపారు. అయితే, తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఎన్టీపీసీ వర్గాలు తెలిపడం గమనార్హం. అదేకాక ఈ ఏడాది దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉంది. కానీ ఏపీలో మాదిరి ఎక్కడ గంటల తరబడి పవర్ కట్ మాత్రం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి లేని సమస్య.. ఒక్క ఏపీకి మాత్రమే ఎందుకు.. సాకేంతిక సమస్య తలెత్తితే.. సరిచేయడానికి ఇంత సమయం పడుతుందా.. అని జనాలు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కరెంట్ కోతల వెనక అసలు కారణం.. సాంకేతిక సమస్య కాదు.. వేరే ఇతర సమస్యలు ఉన్నాయి అంటున్నారు.
ఎన్టీపీసీకి బకాయిలు చెల్లంచని కారణంగానే కోతలు..
అయితే అధికారులు చెబుతున్నట్లు ఎన్టీపీసీలో సాంకేతిక సమస్య వల్ల ఈ కరెంట్ కోతలు తలెత్తలేదట. ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు బకాయిపడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం కారణంగానే పవర్ సరఫరా నిలిచిపోయి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు మొదలయ్యాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు సుమారు 350 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. వీటికోసం ఎన్టీపీసీ వర్గాలు రెండు నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నాయి. స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపేసినట్లు సమాచారం. ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారమయ్యే వరకూ బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనేందుకు.. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. అందుకే ఏపీలో డిస్కంలు రెండు రోజులుగా కోతలు విధించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జగన్ కొత్త కేబినెట్ లో మంత్రులు కాబోయే వారి లిస్ట్!
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు 350 కోట్ల రూపాయలను డిస్కంలు బకాయి పడ్డాయి. దీనిలో కనీసం.. 30 కోట్ల రూపాయలు అయినా చెల్లించాలని అడిగినా, డిస్కంల నుంచి స్పందన లేకపోవడంతో.. ఎన్టీపీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వరుసగా రెండు, మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తలెత్తింది.
ఇది కూడా చదవండి: డీహెచ్ ఇంట పూజల కలకలం.. మాతాజీ స్టెప్పులేస్తే ఎలా ఉంటాదో తెలుసా!
మరి తెలంగాణ పరిస్థితి అంటే.. ఆ రాష్ట్ర డిస్కంలు కూడా ఎన్టీపీసీ వద్ద నుంచే విద్యుత్ తీసుకుంటున్నాయి. కానీ ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తూ.. రొటేషన్ చేస్తుండటంతో.. ఈ పరిస్థితి తలెత్తలేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే.. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ముందుగానే స్పందించి.. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. కనుకే అక్కడ విద్యుత్ కోతలకు తావు లేదని సమాచారం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.