రవిప్రకాష్.. ఈ పేరు గత కొన్నేళ్ల మీడియా రంగంలో ఉవ్వెత్తున ఎగిసి మళ్లీ రాలిపడింది. అయితే గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రవిప్రకాష్ ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కొంత కాలం నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. కట్ చేస్తే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రవి ప్రకాష్ సమావేశమయ్యారు. వరంగల్ సభ తర్వాత హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ తాజ్ కృష్ణ హోటల్‌లో బస చేశారు.
ఇది కూడా చదవండి: Jagga Reddy: ప్రకాశ్ రాజ్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా తెలుగు మీడియా మీడియా ప్రతినిధులు, మేధావులు, ఉద్యమకారులతో రాహుల్ సమావేశమయ్యారు. అందులో భాగంగానే రవి ప్రకాష్ తో కూడా రాహుల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే హఠాత్తుగా కాంగ్రెస్ వర్గాలు రవి ప్రకాష్ ను ప్రత్యేకంగా పిలవడం వెనుక ఏదైన మతలాబ్ ఉందా అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉండగా రవి ప్రకాష్ కొత్త మీడియా సంస్థతో ముందుకు రానున్నాడని గత కొంత కాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే రవి ప్రకాష్ కొత్త మీడియా సంస్థను ప్రారంభిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే రవిప్రకాష్ రాహుల్ గాంధీతో సమావేశమవ్వడంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.