సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీ కాంత్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఈ వేడుకల సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్థన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. రజినీకాంత్ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేయనున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. రజినీకాంత్‌కు తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీ పాల్గొంటారు. కాగా, రజినీకాంత్ కృష్ణా జిల్లాకు రావటం ఇది రెండో సారి.
2004లో కృష్ణా పుష్కరాల సమయంలో ఓ సారి వచ్చారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకోసం కృష్ణా జిల్లాలో ఆడుగుపెట్టారు. ఇక, సీనియర్ ఎన్టీఆర్, రజినీకాంత్‌కు చక్కటి అనుంబంధం ఉంది. రజినీకాంత్.. ఎన్టీఆర్‌ను అన్నగారు అని పిలిచేవారు. రజినీ.. ఎన్టీఆర్‌తో కలిసి టైగర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా టైంలో మానసిక, శారీరక ఇబ్బందులతో బాధపడుతున్న రజినీకి ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. ఆ సలహాల కారణంగానే తన జీవితంలో మార్పు వచ్చిందని రజినీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి, రజినీకాంత్.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.