రోహిణి కార్తె రాకుండానే భానుడు భగ భగ మండుతున్నాడు. పొద్దునే సూర్యుడు చెమటలు కక్కిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు బెంబేలు పడుతున్నారు. పని ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు జనాలు. ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బెజవాడ, గుంటూరు ప్రాంతాలైతే చెప్పనవసరం లేదు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రోహిణి కార్తె రాకుండానే భానుడు భగ భగ మండుతున్నాడు. పొద్దునే సూర్యుడు చెమటలు కక్కిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు బెంబేలు పడుతున్నారు. పని ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు జనాలు. ఎండలు ఠారెత్తుతున్న సమయంలో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఎండలతో మండిపోతున్న ఏపీలోని తిరుపతిలో ఒక్కసారిగా వాతారవణం మారిపోయింది. తిరుపతి, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమలలోని శ్రీ వారి సన్నిధికి సమీపంలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరాయి. మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా పెద్ద యెత్తున వాన పడింది. పరుగులు తీసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో భక్తులు తడిచి ముద్దయ్యారు. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు. అయితే తిరుపతిలో వర్షాలు పడుతుంటే.. మిగిలిన ప్రాంతాల్లో మచ్చుకు కూడా వాన కాదు కదా చల్లని వాతావరణం కూడా కనిపించడం లేదు.