ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షం వల్ల వారి కష్టం వృథా పోతోంది. ఇప్పటికే కురుసిన వడగళ్ల వర్షం రైతుల జీవితాల్లో దుఖాన్ని మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు అంటూ వస్తున్న అలర్టులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అకాల వర్షాలు రైతుల కళ్లల్లో నీళ్లు మిగులుస్తున్నాయి. ముఖ్యంగా మిర్చి, పత్తి రైతులు ఈ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వర్షాలు పోయాయిలే అనుకుంటున్న రైతులకు మళ్లీ పిడుగులాంటి వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 9 జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ అంతటా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ మబ్బులు పట్టాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. రాత్రి మాత్రం ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాగల 03 గంటల్లోశ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం,
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు, ప్రకాశం & SPSR నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉంది.దయచేసి అప్రమత్తంగా ఉండండి.
– ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ pic.twitter.com/y0sU75RKeW— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) March 23, 2023