ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రఘువీరా రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఈయనకు పేరుంది. అనంతపురంలోని తన సొంత గ్రామంలోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అంతే కాదు తన గ్రామానికి సమీపంలోని వాగుకు గండి పడితే.. దానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక రైతులతో కలిసి ఇసుక బస్తాలు మోసారు.
ఇటీవల రఘువీరా తన సొంతఊరు నీలకంఠాపురంలోని 1200 ఏళ్ల కిందటి చారిత్రక నీలకంఠేశ్వరుడి గుడి జీర్ణోద్ధరణకు ఆయన కృషి చేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు సతీమణితో కలిసి మోపెడ్‌పై వచ్చారు. ఇలా ఏదో ఒక రకంగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ వచ్చాయి. తాజాగా ఓ ఫన్నీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
తన మనవరాలు పేరు సమైరా అని ఆమెతో ఆడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని ఆయన పలుసార్లు చెప్పారు. ఈ ఫోటోలో తెల్లని గడ్డంతో..తెల్ల దుస్తుల్లో చిరు నవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఇటీవల తన మనవరాలితో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Annoyed that I haven’t spent enough time with her, my grand daughter Samaira tied me up to a pillar and demanded that I stay at home to play with her. pic.twitter.com/JISjujg8GV
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 2, 2021
Good morning!! pic.twitter.com/WGpeZtHtjg
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) October 31, 2021