దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం మారింది. పులివెందుల అంతటా బంద్ వాతావరణం కనిపిస్తోంది. వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసేసి బంద్ పాటిస్తుండగా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు.
దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇవాళ ఉదయం పులివెందులలో ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలో పులివెందులలో టెన్షన్ వాతావరణ నెలకొంది. వ్యాపారులు స్వచ్చంద బంద్ పాటిస్తుండగా.. వైసీపీ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది.
దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం మారింది. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని తరలించిన పోలీసులు, ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో ఆయనను సీబీఐ మేజిస్టేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. ఇదిలావుంటే భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. వ్యాపారులు షాపులు మూసేసి స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు. దీంతో పులివెందుల అంతటా బంద్ వాతావరణం కనిపిస్తోంది.