రెండు రోజుల క్రితం ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చేతులు మీదుగా.. అట్టహసంగా ప్రారంభమైన కార్డెలియో క్రూయిజ్ షిప్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. కార్డెలియా క్రూయిజ్‌షిప్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో హల్ట్ అయ్యేందుకు అనుమతికి నిరాకరయించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఫలితంగా.. క్రూయిజ్ షిప్ నడి సముద్రంలోనే ఆగిపోయింది. ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్‌ని అనుమతించకపోవడంతో.. పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి షిప్ సముద్రంలోనే ఆగిపోయింది.
ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం, మారిటైమ్ బోర్డ్, క్రూయిన్‌ను ఆపరేట్ చేస్తోన్న జయభక్షి గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఒకవేళ అవి సఫలం కాకపోతే.. క్రూయిజ్‌ను 30 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉన్న కడలూరు పోర్టులో షిప్‌ను ఆపేందుకు జయభక్షి గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది.