ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మానసిక పరిస్థితి బాగాలేని సైకోలు రోడ్లపైకి వచ్చి తెగ హల్చల్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి చేతిలో ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాటితో ఎదుటివారిపై దాడులు చేస్తుంటారు.
ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మానసిక పరిస్థితి బాగాలేని సైకోలు రోడ్లపైకి వచ్చి తెగ హల్చల్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి చేతిలో ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాటితో ఎదుటివారిపై దాడులు చేస్తుంటారు. రెండు రోజుల క్రితం అమలాపురంలోని ఏఎంజి కాలనీ లో ఇద్దరు మహిళలపై ఓ సైకో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇందులో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమలలో ఓ సైకో తనకు మద్యం కావాలని హల్ చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ జహీరాబాద్ కి చెందిన మహేష్ అనే యువకుడు తిరుమలకు వచ్చాడు. మతిస్థిమితం లేని మహేష్ తనకు మద్యం కావాలని లేపాక్షీ సర్కిల్ వద్ద హల్చల్ చేశాడు. తనకు మద్యం ఇవ్వకపోతే బ్రిడ్జీ పై నుంచి దూకేస్తా అంటూ బెదిరించాడు. అక్కడికి వచ్చిన భక్తులపై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చి మహేష్ ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ యువకుడు విజిలెన్స్ సిబ్బంది పై కూడా దాడికి యత్నించాడు. అప్పటికే తనకు మద్యం కావాలని లేదంటే తాను చనిపోతా అని బెదిరిస్తున్న మహేష్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ సిబ్బంది. కానీ వాళ్ల మాటలు వినకుండా గట్టిగా అరుస్తూ దాడి చేయడం మొదలు పెట్టాడు.
అతన్ని ఆపేందుకు ఓ సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా ఆ గార్డుని పట్టుకొని పై నుంచి కిందకు దూకాడు. దాంతో సైకోతో పాటు సెక్యూరిటీ గార్డు కి కూడా గాయాలు అయ్యాయి. ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని మానసిక పరిస్తితి బాగా లేని కారణంగా కాళ్లూ.. చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.