పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ55 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక, పీఎస్‌ఎల్‌వీ-సీ55 కేవలం వాణిజ్యపరమైనదని ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ55 ప్రయోగం విజయవంతమైంది. సుమారు 26 గంటల కౌంట్ డౌన్ తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సీ55 నింగిలోకి దూసుకెళ్లింది. రెండు విదేశీ ఉపగ్రహాలైన టెలియోస్-2, 16 కిలోల లూమ్ లైట్-4 లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో టెలియాస్-2, 16 కిలోల లూమ్ లైట్-4 ఉపగ్రహాలు సింగపూర్‌కు చెందినవి. రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నెల రోజుల లోపే మరో రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంది.
ఇలాంటి ప్రయోగం ఇక్కడ ఇదే తొలిసారి జరిగిందని ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇక, పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగించిన రాకెట్ పూర్తిగా వాణిజ్యపరమైనదని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య లాంటి అంతరిక్ష పరిశోధనలు కూడా ఉంటాయన్నారు. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్ కావటం విశేషం. అంతేకాదు! ఇస్రో ఇప్పటివరకు 424 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. మరి, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ55 ప్రయోగం విజయవంతం అవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.