ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్‌ఎస్‌జీ అధికారికి క్షమాపణ చెప్పారు. ఎందుకంటే..
ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సై అంటే సై అంటూ నేతలు సవాళ్లు విసురుకున్నారు. అసలే జరుగుతుందో అర్థం కాక సామాన్యులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరి ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాలో ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అంటే.. చంద్రబాబు పర్యటన. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు శుక్రవారం ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెంలో పర్యటించారు. రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో రాజకీయ ప్రత్యర్థులు.. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. ఆయన వెళ్లే మార్గంలో ప్లకార్డులు, నల్ల జెండాలు పట్టుని నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక.. చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడి కూడా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి.. తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎన్ఎస్‌జీ సిబ్బంది చంద్రబాబు నాయుడిపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ షీట్లను ఆయనకు అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఎన్ఎస్‌జీ కమాండర్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. ఈ క్రమంలో ఆయనను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. సంతోష్ కుమార్ గాయానికి కుట్లు వేశారు. ప్రసుతం ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు.
ఇక రాళ్ల దాడి ఘటనలో తనకు రక్షణ కల్పించే క్రమంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎన్‌ఎస్‌జీ అధికారి సంతోష్‌ను చంద్రబాబు పరమార్శించారు. తనను కాపాడటం కోసం జరిగిన ప్రయత్నంలో సంతోష్ కుమార్ గాయపడటం దురదృష్టకరమని అన్నారు. అంతేకాక జరిగిన ఘటనపై ఎన్‌ఎస్‌జీ అధికారికి క్షమాపణ చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సంతోష్‌కు అందిస్తోన్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.