Liquor Bottles: మద్యం ప్రియులు కచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే ఇది. కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు పోలీసులు. బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ సమక్షంలో ఈ అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్ఈబీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి తెస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో జిల్లాలోని ఎస్ఈబీ స్టేషన్లలో 904 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోని పలు రకాల బ్రాండ్లకు చెందిన 42,810 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న వీటి విలువ రూ. 2.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
వీటిని బుధవారం రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మాలిక గార్గ్ పేర్కొన్నారు. మరో పక్క అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను ధ్వంసం చేశారు. తనిఖీల్లో పట్టుబడిన అక్రమ మద్యం 8800 బాటిళ్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్యను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి నిరసన.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!