తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు కష్ట కాలం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు కరోనా కష్టాలు పరిశ్రమని వెంటాడాయి. ఇప్పుడు టికెట్స్ రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం పరిశ్రమ పెద్దలను షాక్ కి గురి చేస్తున్నాయి. టికెట్స్ రేట్లు తగ్గించడం అన్నది సామాన్యులకి ఊరట కల్పించే విషయమే అయినా.., సినిమా క్వాలిటీని దెబ్బ తీస్తుందన్నది మేకర్స్ వాదన. ఇక ఈ రేట్లతో థియేటర్స్ రన్ చేయడం కూడా కష్టమని థియేటర్స్ ఓనర్స్ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ రన్ అవ్వడం మరింత కష్టంగా మారింది. ఇప్పటికే అన్నీ జిల్లాలల్లో.. కొన్ని ధియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య బయ్యర్స్, ధియేటర్ ఓనర్స్ మాత్రమే కాదు.., స్టార్ హీరోలు కూడా నష్టపోతున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యారు.
ఇది కూడా చదవండి:
ప్రభాస్ భుజంపై చేతులు వేసి.. నవీన్ పోలిశెట్టి కామెడీ.. ఫ్యాన్స్ ఫైర్!
నెల్లూరు లోని సూళ్లూర్ పేట V ఎపిక్ థియేటర్ క్లోజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కలిగిన ఈ థియేటర్ మూతపడటంతో అంతా షాక్ కి గురయ్యారు. యువీ క్రియేషన్స్ సంస్థకు చెందిన ‘వి సెల్యులాయిడ్’ దే ఈ ధియేటర్. 2019లో రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ధియేటర్ స్టార్ట్ అయ్యింది. సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం అనే ఒక పల్లెటూరులో ఈ ధియేటర్ ఉంది. దీని నిర్మాణానికి మొత్తం 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఇందులో హీరో ప్రభాస్ కూడా పార్ట్నర్ అని టాక్ ఉంది. పల్లెటూరులో ఉంది కాబట్టి ఈ ధియేటర్ లో టికెట్ ధరని రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. మరి.. ఇంత పెద్ద ధియేటర్ లో టికెట్ రేటు అంత తక్కువ ఉంటే.. ధియేటర్ ని నడపడం సాధ్యమా? అందుకే ఈ ధియేటర్ ని ముసేసినట్టు తెలుస్తోంది. ఇలా సీఎం జగన్ ఎఫెక్ట్ ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ని సైతం తాకింది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.