తిరుమలలో వర్షపాతం తగ్గినప్పటికీ ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మాత్రం ఆగట్లేదని టీటీడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. అదేవిధంగా శ్రీవారి భక్తులకు కూడా ఆయన తగు సూచనలు చేశారు. ఇటీవలే తిరుమల దేవస్థాన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. తిరుమల రహదారి ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతినటం జరిగింది. ఆ మార్గంలో వాహనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తిరుమల చుట్టుపక్కల నాలుగు ప్రాంతాల్లో రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది. రోడ్డు రిపేర్ కు సంబంధించి ఐఐటి నిపుణులు రానున్నారు. అలాగే రహదారి పునరుద్ధరణకు కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తిరుమలను దర్శించుకునే ఆలోచన భక్తులు ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిదని సుబ్బారెడ్డి సూచించారు. అంతేకాకుండా ఆల్రెడీ టికెట్స్ కొనుక్కున్నవారు కంగారు పడాల్సిన అవసరం లేదని, రాబోవు ఆరు నెలల్లో ఎప్పుడైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం రహదారి పై రాళ్లు పడి కోతకు గురికావడంతో టిటిడి అధికారులు రాకపోకలు నిలిపేశారు. అలాగే టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ అధికారులు రహదారి పై పడిన కొండచరియలు తొలగించే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి.. తిరములలో ఎప్పుడు చూడని ఈ ప్రకృతి బీభత్సం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.