ఏపీ సీఎం వైఎస్ జగన్ మంచితనంపై ప్రశంసలు కురిపించారు నటుడు పోసాని కృష్ణమురళి. ఒక్కసారి సీఎం జగన్ ఎవరినైనా అభిమానిస్తే.. నా మనిషి అనుకుంటే.. ఎంత ఆప్యాయత చూపుతారో వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని సీఎం జగన్ తనపై ఎంతటి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారో వివరిస్తూ.. ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..
“కొన్ని రోజలు క్రితం నాకు, నా భార్య, నా ఇద్దరు కుమారులకు కరోనా వచ్చింది. నాకు కరోనా రావడం అది రెండో సారి. అప్పుడు చాలా సీరియస్ గా ఉంది నా పరిస్థితి. మన నలుగురిలో ఎవరు ఉంటారో.. ఎవరు చనిపోతారో అని నేను నా భార్య జోక్ చేసుకున్నాం. కానీ.., మేం నలుగురం కరోనాతో ఆస్పత్రిలో చేరామని తెలిసి.. సీఎం జగన్ భార్య భారతి గారు ఇంటి దగ్గర నుంచి సీఎం ఆఫీస్ కు కాల్ చేసి.. మా గురించి విచారించారు. మాకు మంచి వైద్యం అందేలా చూడాలని స్వయంగా సీఎం కార్యాలయంలో ఉన్న అధికారికి కాల్ చేసి చెప్పారు’’ అని తెలిపారు.
‘‘ఒక్క భారతి గారు మాత్రమే కాదు, సీఎం జగన్ కూడా ఆ సమయంలో మా క్షేమ సమాచారాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ మాపై చూపిన ఆదరణను ఎన్నటికి మర్చిపోలేను’’ అంటూ పోసాని భావోద్వేగానికి గురయ్యారు. మరి.. పోసాని కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
😢😢😢😢 pic.twitter.com/LFjrL8rK2n
— kiran 🇸🇱 (@Gjkiran20) February 11, 2022