ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల ప్రముఖ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. పోసాని కృష్ణమురళి చాలా కాలం నుంచి వైసీపీ కి మద్దతుగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని ప్రశంసించారు. అలానే అలీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోసాని వైసీపీ తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతు కృషి చేశాడు. జగన్ సీఎం అయిన తరువాత పోసానికి కీలక పదవి దక్కనుందని ప్రచారం సాగింది. పలు సందర్భాల్లో ఆయనకి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా పోసానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సినీ నటుడు పోసాని మురళికృష్ణను నియమించిన ప్రభుత్వం. https://t.co/AFLbR5Fkaw
— YSR Congress Party (@YSRCParty) November 3, 2022