శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్న విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ బాలాజీపేట సెంటర్‌కు వెళ్తున్నారు. హుకుంపేట-బాలాజీపేట రోడ్డు మీద శ్రమదానం చేయనున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు కదులుతున్నారు.
ఓ వైపు పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్‌కు పవన్ కల్యాణ్ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ కాన్వాయ్ ని అడ్డుకోవొద్దని గొడవకు దిగారు. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శాంతియుతంగా తమ కార్యకర్తలు తమ పని చేసుకుంటు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని వదిలిపెట్టారు పోలీసులు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు జనసైనికులు.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్‌ని అనుసరిస్తూ.. బైక్‌లపై పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
జనసేనాని సభకు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్న ప్రభుత్వం. అసహనం వ్యక్తం చేసిన అధినేత శ్రీ @PawanKalyan#JanaSenaSramadaanam#JSPForAP_Roads pic.twitter.com/QiC5vR7dT5
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2021