విశాఖ జిల్లా మధురవాడ వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. పెళ్లి ఆపాలనుకొనే ప్రయత్నంలోనే ప్రాణాలు సృజన ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఆమె కాల్ డేటా, చాటింగ్ హిస్టరీ రికవరీ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి మూడు రోజుల ముందు సృజన తన ప్రియుడితో ఇన్ స్టా గ్రామ్ లో చాటింగ్ చేసింది. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి ఆమె హామీ ఇచ్చింది. కాకపోతే ఊహించని రీతిలో పెళ్లి పీటలపై కుప్ప కూలి సృజన మృతి చెందింది.
పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యకితో సృజన ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్ళికి నిరాకరిస్తూ వచ్చాడు. ఆమెను కూడా కొంత సమయం తన కోసం వెయిట్ చేయాలంటూ కోరినట్లు చెబుతున్నారు. సృజన తల్లిదండ్రులు ఈనెల 11న మధురవాడలో ఘనంగా పెళ్లి చేసేందుకు అంతా సిద్ధం చేశారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఇద్దరూ ఇన్ స్టా గ్రామ్ లో చాటింగ్ చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వాయిస్ మెసేజ్!
పెళ్లి ఇష్టం లేదని.. ఎలాగైన తనను తీసుకు వెళ్లిపోమని మోహన్ ను సృజన కోరింది. అయితే అందుకు నిరాకరించిన మోహన్ తనకు రెండేళ్ల సమయం కావాలని కోరాడు. అతని మాట విన్నాక పెళ్లిని ఎలాగైన ఆపడానికి ట్రై చేస్తానని సృజన మోహన్ కు హామీ ఇచ్చింది. ఆ తర్వాత సృజన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ కాల్ డేటా అన్నీ డిలీట్ చేసింది. పెళ్లి ఆపేందుకు విష పదార్థం తినడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి పెళ్లి పీటలపై కుప్పకూలింది. హుటాహుటిన సృజనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తండ్రి చాటు కూతురు! అత్తింట శవమై తేలింది! గ్లోరీ చనిపోయిందా? చంపేశారా?
ఇదీ చదవండి: త్రిబుల్ సూసైడ్.. సూసైడ్ నోట్‌లో ఏం రాశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?…